సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్న సినిమా ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీమేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా, కీర్తి సురేష్ కథానాయికగా చేస్తోంది. బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశాలతో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. దానికి తగ్గట్లే షూటింగ్‌లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు దర్శకుడు పరశురామ్. అయితే ఈ మధ్యే ఈ చిత్రబృందం దుబాయ్ షెడ్యూల్‌లో యాక్షన్ సన్నివేశాలు, మహేశ్, కీర్తిసురేష్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించింది చిత్ర యూనిట్. ఇది ఇలా ఉండగా.. ‘ఉప్పెన’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మోడల్ కృతీశెట్టి… నక్క తోక తొక్కిందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు. మొదటి సినిమా విడుదల కాకముందే… రెండు మూడు ఆఫర్స్ ను తన కిట్ లో వేసేసుకుంది కృతీశెట్టి. నేచురల్ స్టార్ నానితోనూ, సుధీర్ బాబుతోనూ ఇప్పటికే సినిమాలు చేస్తున్న కృతీశెట్టిని… రామ్ ద్విభాషా చిత్రంలోనూ పెట్టుకున్నాడు దర్శకుడు లింగుస్వామి. తాజాగా ఈ అమ్మడు ప్రిన్స్ మహేశ్ బాబు సరసన కూడా ఛాన్స్ దక్కించుకుందన్నది ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న మాట.’ఎఫ్ 3’ మూవీ పూర్తి కాగానే అనిల్ రావిపూడి మహేశ్ తోనే సినిమా చేస్తాడట. ఈ సినిమా కోసం మహేశ్ సరసన కృతీశెట్టిని ఎంపిక చేశారని, దీనికి సంబంధించిన అధికారిక సమాచారం త్వరలోనే వస్తుందని అంటున్నారు.
previous post
next post
“సాహో”పై గుర్రుగా ఉన్న చందమామ