telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఇది కదా సంస్కారం అంటే?

అన్న నందమూరి తారక రామారావు మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు గారిని తమిళ సూపర్ స్టార్ ఎం.జి.
రామచంద్రన్ గారిని మద్రాస్ లో తన ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టినప్పటి అపురూప దృశ్యం . …
ఇది 52 సంవత్సరాలనాటి సంఘటన.

1972 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గావున్న పి.వి.నరసింహారావు గారు ఒక సారి మద్రాసు వచ్చారు . ఎన్.టి.రామారావు గారు పి .వి .నరసింహారావు గారిని వారి ఇంటికి భోజనానికి ఆహ్వానించారు . రామారావు గారి ఆహ్వానానికి పి .వి గారు ఎంతో సంతోషించారు.
తెలుగు సినిమా రంగంలో రామారావు గారు , నాగేశ్వర రావు గారు ఇద్దరూ అగ్రనటులు . అందుకే రామారావు గారితో తప్పకుండా వస్తానని చెప్పారు . తమిళనాడు సూపర్ స్టార్ తన మిత్రుడు అయిన ఎం.జి. రామచంద్రన్ గారిని కూడా రామారావు గారు భోజనానికి ఆహ్వానించారు .

ఎలాంటి హంగు ,ఆర్భాటం లేకుండా ఈ ముగ్గురూ సంప్రదాయానికి విలువనిచ్చి చక్కగా కింద కూర్చుని భోజనం చేశారు.
రామారావు గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగు దేశం పార్టీని మర్చి 29,1982 న ప్రారంభించారు . తొమ్మిది నెలల వ్యవధిలోనే సుడి గాలి పర్యటన చేసి అధికారంలోకి వచ్చారు . జనవరి 9, 1983న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు .
1991లో పి .వి ,నరసింహారావు ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు . అప్పుడు ఆయన ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల నుంచి పార్లమెంట్ కు పోటీచేసినప్పుడు తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడైన రామారావు గారు తమ అభ్యర్థిని నరసింహారావు గారికి పోటీగా నిలబెట్టలేదు.

ఒక తెలుగు వారు ప్రధానిగా వున్నపుడు వారి మీద పోటీ పెట్టకూడని నిర్ణయం తీసుకున్నారు .
ఎన్ .టి .ఆర్ కు కాంగ్రెస్ పార్టీ అంటే గిట్టదు .అలాంటి కాంగ్రెస్ పార్టీలో వున్న నరసింహారావు గారి మీద తెలుగు దేశం అభ్యర్థిని నిలబెట్టక పోవడం ఎన్ .టి .రామారా గారికి తెలుగు జాతి అంటే వున్న అభిమానం. ఆయన సంస్కారం .

Related posts