హాస్య నటుడు అలీ గుంటూరు నగరంలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గుంటూరులో ఓటు హక్కు కల్పించాలని కోరుతూ తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు సమర్పించారు.
దరఖాస్తును పరిశీలించిన ఎన్నికల అధికారులు ఇప్పటికే హైదరాబాద్‌లో ఓటరుగా నమోదై ఉన్నారనే విషయాన్ని అలీకి వివరైంచారు. తనకు తెలంగాణలో ఓటు హక్కు తొలగించినా అభ్యంతరం లేదని, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఓటు హక్కు కల్పించాలని ఆయన అధికారులను కోరారు.
డ్రోన్ కెమెరాలంటే చంద్రబాబుకు ఎందుకు భయం: ఎమ్మెల్యే రోజా