telugu navyamedia
క్రీడలు వార్తలు

ఆసీస్ కెప్టెన్ అరుదైన రికార్డు…

ప్రస్తుతం భారత్-ఆసీస్ ల మధ్య జరుగుతున్న మొదటి వన్డేలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ అరుదైన రికార్డును సాధించాడు. వన్డే మ్యాచ్‌లలో అత్యంత వేగంగా 5వేల పరుగు చేసిన ఆస్ట్రేలియన్ క్రికెటర్‌గా ఆరోన్ ఫించ్ నిలిచాడు. అయితే ఫించ్ ఈ ఘనతను భారత జట్టుతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో సాధించాడు. ఫించ్ సిడ్నీ వేదికగా జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్‌లో తన 126వ ఇన్నింగ్స్‌లో తన 5వేల పరుగుల లక్ష్యాన్ని చేరుకుననాడు. దీంతో మాజీ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డీన్ జోన్స్‌ను దాటాడు. డీన్ జోన్స్ తన 128వ ఇన్నంగ్స్‌లో 5వేల పరుగులను పూర్తి చేశారు. అయితే అత్యంత వేవంతమైన వారిలో మాత్రం ఆరోన్ ఫించ్ రెండవ స్థానంలోనే నిలిచాడు. మొదట స్థానంలో డేవిడ్ వార్నర్ ఉన్నాడు. దేవిడ్ వార్నర్ కేవలం 115 ఇన్నింగ్స్‌లో 5వేల పరుగులను అదిగమించాడు. దాంతో మొదటి స్థానాన్ని తీసుకున్న డేవిడ్ వార్నర్ ఇప్పటికీ అక్కడే సుస్తిరంగా నిలుచునున్నాడు. ఇదిలా ఉంటే టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌ను ఎంచుకుంది. దాంతో సుభారంభం చేసిన ఆస్టేలియా 20 ఓవర్లలో 100 పరుగులు చేసింది. అయితే ఈ రోజు మొదట్లో భారత, ఆస్ట్రేలియన్ ఆటగాళ్లందరూ బేర్ ఫుట్‌ సాంప్రదాయాన్ని పాటించారు. దీని ద్వారా ఆ ప్రదేశం యొక్క ఓనర్లకు గౌరవం ఇచ్చినట్లని ఆస్ట్రేలియన్స్ నమ్మకం అందుకని ఇరు జట్లు ఆ సంప్రదాయాన్ని పాటించాయి.

Related posts