telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు వ్యాపార వార్తలు

వందరోజులలో.. ప్రైవేట్ రైళ్లు పట్టాలపైకి.. ఇప్పటికి రెండే ..

2 trains into private hands in just 100 days

100 రోజుల్లో రెండు రైళ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించి నిర్వహించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇలా దేశంలో తొలి ప్రైవేటు రైలు పట్టాలపై పరుగులు తీయనుంది. దీనిలో భాగంగా దిల్లీ-లఖ్‌నవూ మార్గంలో తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రైవేటు సంస్థలకు అప్పగించబోతున్నారు. ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు సిద్ధం చేసిన రైలు, ఢిల్లీలోని, ఆనంద్‌నగర్‌ రైల్వే స్టేషన్‌లో ఉంది. ప్రైవేటు సంస్ధలకు అప్పగించే రైళ్ల బాధ్యతను ఐఆర్‌సీటీసీకి బదలాయించనున్నారు.

ఈ రెండు రైళ్లను ప్రయోగాత్మకంగా 100 రోజుల్లోపు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి నడిపిస్తారు, అత్యధిక రద్దీ మార్గాలను, పర్యాటక ప్రాంతాలను గుర్తించి ఆ మార్గంలో మరో ప్రైవేటు రైలు నడిపేందుకు ఉన్న అవకాశాలను గుర్తిస్తామని రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు.

ఒక జాతీయ పత్రిక కథనం ప్రకారం తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రత్యేకతలు :

1. ఈ రైలు సీట్లు పసుపు, ఆరెంజ్‌ రంగుల్లో ఉంటాయి. అవి రైలు రంగుకు సరిగ్గా మ్యాచ్‌ అవుతాయి.
2. కోచ్‌లకు ఆటోమేటిక్‌ డోర్లు ఉంటాయి. కొత్త రైలుకు మొత్తం 23 బోగీలు ఉంటాయి.
3. ప్రతి సీటు వెనుక ఎల్‌సీడీ ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌ అమర్చి ఉంటుంది. ఈ సౌకర్యం విమానాల్లో అందుబాటులో ఉంది. మొబైల్‌ ఛార్జింగ్‌ పాయింట్లు ఉంటాయి.
4. ఈ రైలు బోగీల్లో ఎల్‌ఈడీ లైట్లు ఉన్నాయి. దీంతో పాటు ఎఫ్‌ఆర్‌పీ ఇంటీరియర్‌ ప్యానల్స్‌, మాడ్యూలర్‌ టాయిలెట్లు, స్మార్ట్‌ విండోస్‌కు మోటార్‌ ఆపరేటెడ్‌ కర్టెన్లు ఉంటాయి.

Related posts