ఏపీ రాజధాని గురించి సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. మూడు ప్రాంతాల అభివృద్ధి చెందాలని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కట్టాలంటే లక్షల కోట్లు ఖర్చు అవుతుందని లెక్కలు చెబుతున్నాయి అయితే మనకి డబ్బులు ఎక్కడ నుండి వస్తాయి వంటి విషయాలని ఆలోచించాలని అదే మూడు చోట్ల రాజధాని ఉంటే చాలా సులువుగా రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు అన్ని ప్రాంతాల ప్రజలు తమ ప్రాంతాలలో అభివృద్ధి జరిగిందని అభిప్రాయపడతారు అన్నట్టుగా అసెంబ్లీ జగన్ పేర్కొనటం జరిగింది. ఈ సందర్భంగా విశాఖ లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టుకోవడానికి అనువైన ఏరియా అని అది ఆల్రెడీ అభివృద్ధి చెందిన ప్రాంతమని త్వరలో మెట్రో కూడా అక్కడ ఏర్పాటు చేస్తే అన్ని విధాలుగా బాగుంటుందని, రోడ్లు కూడా బాగుపడితే ఇంకా బాగుంటుంది, అక్కడ పెట్టాల్సిన ఖర్చు పెద్దగా ఏమీ ఉండదని జగన్ పేర్కొన్నారు.
ఆయా సంభవాలపై ఒక కమిటీ వేసినట్లు జగన్ పేర్కొన్నారు. ఆ కమిటీ స్టడీ చేసి ఒక రిపోర్టు తో ముందుకు రానున్నట్లు అసలు రాజధాని విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తే బాగుంటుంది అన్న దాన్ని విషయంపై రెండు కంపెనీలు ప్రస్తుతం స్టడీ చేస్తున్నట్లు వైయస్ జగన్ పేర్కొన్నారు. దీంతో వైజాగ్ లో ఉన్న ప్రాంతవాసులు జగన్ అసెంబ్లీలో చేసిన రాజధాని ప్రసంగం పట్ల టపాసులు కాల్చడం మొదలు పెట్టారు. ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడిన ప్రాంతాల్లో ఎప్పటినుండో ఉన్న నేపథ్యంలో నిజంగా వైయస్ జగన్ మా తలరాత మార్చాడు మా బతుకులు మారుతాయి అంటూ డాన్స్ లు వేస్తున్నారు. మరోపక్క చాలామంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మేధావులు ఇది నిజంగా సంతోషించే ప్రకటన అని జగన్ మూడు ప్రాంతాలలో మూడు రాజధాని చెప్పడం పట్ల చాలా చోట్ల నుండి హర్షం వ్యక్తమవుతోంది.