telugu navyamedia
క్రీడలు వార్తలు

తమిళ స్టార్ విజయ్ అరుదైన ఘనత…

vijay master movie releasing date

తమిళ హీరో విజయ్ నటించిన మాస్టర్ సినిమా టీజర్ అరుదైన ఘనతలు సాధించిన విషయం తెలిసిందే. ఆ టీజర్‌కు వచ్చిన వ్యూస్, లైక్స్‌తో సోషల్ మీడియాలో ఈ సినిమా  వీరవిహారం చేసిందనడంలో సందేహమే లేదు. అయితే ఈ టీజర్ వచ్చిన ఒక్క రోజులో భారీ రికార్డులను బద్దలు కొట్టింది. దాంతో ఈ హీరో అభిమానుల్లో మరింత జోరు పొంగింది. దాంతో వారు తమ అభిమాన హీరోతో మరో రికార్డే సృష్టించాలనుకున్నారు. అంతే వారం రోజులు కూడా తారగకుండానే 40 మిలియన్ వ్యూస్‌ వచ్చాయి. కేవలం వ్యూస్‌తో తన రికార్డులను ఆపలేదు ఈ టీజర్ లైక్‌ల్లోనూ మరో రికార్డును సాధించింది. తన రికార్డులను తానే ఎంతో సులభంగా దాటేసింది. ఈ టీజర్‌కు దాదాపు 2.5 మిలియన్ లైక్స్ రావడంతో మొత్తం దక్షణాదిలోనే టాప్‌లో నిలిచింది. ఈ రికార్డులు విజయ్ అభిమానుల్లో మాస్టర్ పై ఉన్న అంచనాలకు అద్దం పడుతున్నాయి. అయితే ఈ సినిమా క్రేజ్‌ను చూసి సినిమా నిర్మాతలే విస్తుబోయారు. విజయ్ సినిమాకు ఎందుకింత హైక్ అంటూ నాలుకరుచుకున్నారు. ఈ ఘనత నిర్మాతదో, దర్శకుడిదో కాదని, విజయ్ ఏసినిమా చేసినా రెస్పాన్స్ ఇలా ఉంటుందని, దానికి తోడుగా ఈ సినిమా టీజర్ మళ్లీ మళ్లీ చూసేల ఉండటమే కారణమని తెలుసుకున్నారు.

Related posts