telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రపంచంతో పోటీపడాలంటే ఆంగ్ల మాధ్యమం!

english medium classes in kasturiba schools

వచ్చే విద్యాసంవత్సరం నుంచి క్రమంగా ఆంగ్ల మాధ్యమంలోనే ప్రభుత్వ బడులలో పాఠాలు బోధించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో తెలుగు మాధ్యమం నిలిపివేయడం తెలుగు భాష ఉనికికే ప్రమాదమని ప్రతిపక్షాలు విమర్శలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయం అమెరికాలో నివసి స్తున్న కొందరు తెలుగు వారిని కూడా విస్మయానికి గురి చేసింది.

గతంలో ఇటీవల ఉన్నత పాఠశాల విద్య వరకూ తెలుగు మాధ్యమంలో చదువుకున్న చాలామంది అమెరికా లాంటి విదేశాలలో ఉన్నత స్థానాలకు ఎదగగలిగారని చెప్పినా అది అంతగా నమ్మసక్యంగా లేదు. ఇంగ్లీషు మాధ్యమంలో చదువుకుంటేనే బతుకు తెరువు లేకుంటే లేదు అన్నట్లుగా నేడు వ్యవహరిస్తున్నారు. ప్రైవేటు విద్యాలయాలు తెలుగు మాధ్యమంలో చదువుకుంటే పిల్లలకు బతుకు లేదనీ ప్రచారం చేస్తున్నాయి. వారు అమెరికా వెళ్లలేరని విపరీత ప్రచారాలు చేశారు. చేస్తున్నారు. వీటికి తోడు ప్రభుత్వాలు విద్యా ప్రైవేటీకరణను బాగా ప్రొత్సహించటంతో పరిస్థితులు మరింత దిగజారాయి.

ఇలాంటి పరిస్థితులలో అమెరికాలో ఉంటున్నా , తెలుగు వారి భాష, జాతి,సంస్క్రతి పట్ల నిజమైన ప్రేమాభిమానాలు కలవారు కొంత అసహనానికి గురవ్తున్నారు. తెలుగు భాష ద్వారా ఇంగ్లీషు లేక ఏ ఇతర పరాయి భాష అయినా సరే నేర్చుకోవడం సులువు అన్న విషయం వివరించాలి. అమెరికా లో ఫ్రెంచి, జర్మన్, జపాన్, కొరియా , చైనా, రష్యా మొదలైన దేశస్తులు అందరూ తమ తమ మాత్రు భాషలలోనే ఉన్నత విద్యలు కూడా చదువుకుని ఉండి నప్పటికీ, ఆయా రంగాలలో రాణిస్తున్నారు.

Related posts