telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

అంగీకార సహజీవనాన్ని అత్యాచారంగా భావించలేం: సుప్రీం కీలక రూలింగ్

Supreme Court

సహజీవన్ పై సుప్రీంకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. కొంతకాలం సహజీవనం చేసిన తరువాత, పురుషుడిపై స్త్రీలు అత్యాచారం కేసులు పెడుతున్న తరుణంలో సుప్రీం కీలకమైన విషయాన్ని వెల్లడించింది. ఓ మహిళ చేసే అంగీకార సహజీవనాన్ని అత్యాచారంగా భావించలేమని వ్యాఖ్యానించింది. ఓ పురుషుడితో ఆర్థిక అవసరాల కోసం లేదా శారీరక సుఖం కోసం సంబంధం ఏర్పరచుకుంటే అత్యాచారం కిందకు రాదని తీర్పిచ్చింది.

సేల్స్‌ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ గా పని చేసిన ఓ మహిళ, సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్‌ తో ఆరేళ్లపాటు సహజీవనం చేయగా, తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి, ఇప్పుడు నిరాకరిస్తున్నాడని సదరు మహిళ కోర్టును ఆశ్రయించింది. అతనిపై అత్యాచార ఆరోపణలతో కేసు పెట్టింది. తననే పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఆరేళ్లు మోసం చేశాడని ఆమె ఆరోపించగా, ఈ కేసును సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, ఇందిరాబెనర్జీలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఆరేళ్ల పాటు పెళ్లి మాటలు ఏమయ్యాయని ప్రశ్నించింది. అంగీకారపూర్వకంగా చేసే సహజీవనం అత్యాచారం కిందకు రాదని కోర్టు అభిప్రాయపడుతూ కేసును కొట్టివేసింది.

Related posts