telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సొంత ఊరిలో గెలవని ఉత్తమ్..దుబ్బాకలో ఎలా గెలుస్తారని ప్రచారం చేస్తున్నారు

harish rao trs

సిద్దిపేట జిల్లాలోని దౌల్తాబాద్, రాయపోల్ మండలాలకు చెందిన కాంగ్రెస్ , బిజెపి పార్టీ లకు చెందిన సుమారు 300 మంది మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ లో చేరారు. వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు కీలక వ్యయాలు చేశారు. ప్రతి ఏటా పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం 11,720 కోట్లు కేటాయిస్తే అందులో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది 210 కోట్లు మాత్రమేనాని తెలిపారు.

లెక్కలు తెలుసుకున్న తర్వాతనే మాట్లాడాలని బిజెపి నాయకులకు మంత్రి సవాల్ విసిరారు మంత్రి హరీష్ రావు. హుజూర్ నగర్ లో సొంత ఊరిలో గెలవని ఉత్తంకుమార్ రెడ్డి దుబ్బాకలో ఎలా గెలుస్తారని ఇక్కడ ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపి డిపాజిట్లు గల్లంతు అయ్యాయని..  దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, బీజేపీల డిపాజిట్లు జప్తు చేస్తామని పేర్కొన్నారు మంత్రి హరీష్ రావు. 

Related posts