telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఉత్తరాఖండ్ వరదలో మరణించినవారికి ‌పరిహారం ప్రకటించిన కేంద్రం…

మంచు చరియలు విరిగి పడడంతో ఉత్తరాఖండ్‌లో మొదలైన వరదల్లో ఇంత వరకూ 10 మంది వరకూ చనిపోగా, 170 మందికి పైగా గల్లంతయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం సహాయ చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మృతులకు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వంతో పాటు కేంద్రం పరిహారం ప్రకటించింది. వరద పోటెత్తడంతో చమోలి జిల్లాను మెరుపు వరదలు ముంచెత్తాయి. దాంతో కీలకమైన సొరంగాలు బురద, శిథిలాలతో మూసుకుపోయాయి. వరదల్లో విద్యుత్‌ కేంద్రాల్లో పని చేసే 170 మంది సిబ్బంది గల్లంతుకాగా, వీరంతా సొరంగాల్లో చిక్కుకుపోయినట్టు భావిస్తున్నారు.  వరద తాకిడికి రేణి గ్రామంలో ఇళ్లు కొట్టుకుపోయాయి. 13కు పైగా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొంత మంది స్థానికులు వరదలో కొట్టుకుపోయారు. వరదలతో సొరంగంలో చిక్కుకుపోయిన వాళ్లను రక్షించేందుకు ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌,  నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ బృందాలు శ్రమిస్తున్నాయి. అయితే మృతులకు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది. అలాగే, మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 

Related posts