telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఆమెకు 12 రోజుల్లో 10 వేల మెసేజ్ లు… ఏమైందంటే ?

Arrest

ఓ వ్యక్తి తనకు పంపుతున్న భయంకరమైన మెసేజ్ లతో భయాందోళనలకు గురైన మహిళా పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. తన మిత్రురాలి ద్వారా నెల్సన్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడని, ఎలాగో తన మొబైల్ నంబర్ సంపాదించాడని ఆమె తెలిపింది. ఆ తర్వాత నుంచి దాదాపు 12 రోజులపాటు తనకు నరకం చూపించాడని వాపోయింది. సుమారు 10 వేల మెసేజిలు పెట్టాడని, చివర్లో అవి మరీ భయం గొలిపేవిగా మారాయని చెప్పింది. “నువ్వు, నేను కలిసి ఏమైనా చేయగలం’.. ‘ఎప్పటికైనా నువ్వు నా చెంతకు చేరాల్సిందే’.. ‘ఓ ట్యాంకర్ వేసుకొని అమెరికాలోని చర్చిలు, భవనాలు అన్నింటినీ పేల్చిపారేద్దాం” ఇలాంటివి నికోలస్ సీ నెల్సన్ పంపే మెసేజ్ లు. ఇవి చూసిన ఆమె భయంతో బిక్కచచ్చిపోయింది. అంతేకాదు ఓ విమానం టికెట్ ఫోటో ఆమె ఫోన్‌కు వచ్చింది. అది కూడా నెల్సన్ పంపిందే. దాంతోపాటు తన మాటలు నిజమని నిరూపించడానికి ఆ విమానాన్ని పేల్చేస్తానని మెసేజ్ పెట్టాడని తన ఫిర్యాదులో పేర్కొంది ఆ మహిళ. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు జార్జియాలో ఉండగా నెల్సన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 17న అరెస్టయిన నెల్సన్.. బెయిలివ్వాలంటూ కోర్టులో పిటిషన్ వేశాడు. అయితే అతని ప్రవర్తనపై అనుమానాలున్నాయని, కాబట్టి బెయిలివ్వడం కుదరదని కోర్టు తేల్చి చెప్పింది.

Related posts