telugu navyamedia
సినిమా వార్తలు

నందమూరి తారకరామారావు గారు తొలిసారి శ్రీరామచంద్రుడు గా నటించిన చిత్రం “సంపూర్ణ రామాయణం”.

నందమూరి తారకరామారావు గారు తొలిసారి శ్రీరామచంద్రుడు గా నటించిన పూర్తి నిడివి చిత్రం “సంపూర్ణ రామాయణం” తమిళం సినిమా. తమిళంలో నిర్మించిన ఈ చిత్రాన్ని 1958 ఏప్రిల్ 14 తమిళ ఉగాది రోజున విడుదలై ఘన విజయం సాధించింది. అనంతరం ఆ సినిమాలు తెలుగు లోకి డబ్బింగ్ చేసి “సంపూర్ణ రామాయణం” పేరుతోనే తెలుగులో విడుదల చేయగా, తెలుగులో కూడా ఆ చిత్రం విజయం సాధించింది.

ఈ సినిమా తమిళంలో ఘన విజయం సాధించి 60 వారాలు ప్రదర్శింపబడింది. తమిళనాడు లోని మధురై లో ఈ చిత్రం 100 రోజుల పండుగ శతదినోత్సవ వేడుకలు రంగ రంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో పాల్గొనేందుకు మధురై విచ్చేసిన ఎన్.టి.రామారావు గారిని రైల్వే స్టేషన్ నుంచి వేదిక వద్దకు అభిమానులు, తమిళ ప్రజలు ఆయనను తమ భుజాలపైకి ఎత్తుకొని ఊరేగింపు గా వేదిక వద్దకు తీసుకుని వెళ్లారు. ఈ విధంగా అరుదైన గౌరం దక్కిన పర బాషా నాయకుడు ఒక్క ఎన్టీఆర్ గారే కావడం విశేషం.

తమిళనాడు కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడైన రాజాజీ గా పిలవబడే చక్రవర్తుల రాజ గోపాలాచారి గారు చూసిన ఒకే ఒక్క సినిమా “సంపూర్ణ రామాయణం”. ఈ చిత్రం శతదినోత్సవ వేడుకలులో పాల్గొన్న రాజాజీ గారు సైతం తమిళ ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అంటూ ఆయనను ఆసభలో కొనియాడారు. ఈ చిత్రంలో నటీమణి పద్మిని సీతాదేవిగా నటించి ప్రేక్షకుల మన్నన పొందగా భరతుని పాత్రలో శివాజీ గణేశన్ గారు నటించి పౌరాణిక పాత్రలను తాను కూడా పోషించగలనని నిరూపించారు.

తెలుగు వారితో పాటు తమిళులకు కూడా శ్రీరాముడన్నా, శ్రీకృష్ణుడన్నా ఒక్క ఎన్.టి.రామారావు గారు మాత్రమే ఆ విధమైన గౌరవం, కీర్తి ఒక్క ఎన్టీఆర్ గారికి మాత్రమే దక్కింది…

Related posts