telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ట్రెండ్ అవుతున్న నితిన్ చెక్ ట్రైలర్…

Check

నితిన్ గత ఏడాది భీష్మ సినిమాతో కెరీర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని అదే దూకుడు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నితిన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా చెక్. ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌లుగా చేస్తున్నారు. ఈ సినిమాను యేలేటి చంద్రశేఖర్ దర్శకత్వంలో ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ అందరి దృష్టి ఆకర్షించింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో హ్యాష్ ట్యాగ్ నెంబర్ వన్‌గా ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాపై ప్రేక్షకులకు ఉన్న అంచనాలను ఈ ట్రైలర్ అమాంతం పెంచేసింది. ఈ ట్రైలర్‌లో నితిన్ ఓ ఖైదీగా కనిపించడం ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించింది. నితిన్ అభిమానులు ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సిమ్రాన్ చౌదరి, పోసాని కష్ణమురళి, సంపత్ రాజ్, మురళి శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఏ మేరకు అభిమానులను మెప్పిస్తుంది అనేది.

Related posts