telugu navyamedia
సినిమా వార్తలు

బన్నీతో గొడవ… స్పందించిన సాయి ధరమ్ తేజ్

Sai-Dharam-Tej

ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్తగా వచ్చిన యువ కథానాయకులు సైతం వరుస సినిమాలతో, హిట్లతో దూసుకెళ్తుంటే మెగా మేనల్లుడు సాయి తేజ్ ,మాత్రం వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ఇటీవల ఆయన నటించిన “చిత్రలహరి” చిత్రానికి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి తేజ్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. “ఏ సినిమా ఎందుకు పరాజయం పాలైంది అనే విషయాన్ని గురించి ఆలోచిస్తాను. ఆ సినిమాకి సంబంధించి ఫలానా విషయంలో తప్పు చేసినట్టుగా అనిపిస్తే, మరోసారి ఆ తప్పు జరగకుండా జాగ్రత్తపడుతుంటాను. తప్పు చేశామే అనుకుని ఆగిపోకూడదనీ… ఆ తప్పుని సరిదిద్దుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలనే మా అమ్మ చెబుతూ ఉంటుంది. ఇక తప్పు ఎక్కడ… ఎలా జరిగినా దానికి ఇతరులను బాధ్యులను చేయడం నాకు ఇష్టం వుండదు. నా సినిమా పరాజయానికి కారకుడని నేనే అని ఒప్పుకుంటాను. పరాజయాల నుంచే పాఠాలను నేర్చుకుంటూ వెళుతుంటాను. ప్రతి పరాజయం ఒక పాఠాన్ని నేర్పుతుందనే విషయాన్ని నేను బలంగా నమ్ముతుంటాను” అని తెలిపారు.

ఇక బన్నీతో మనస్పర్ధలపై స్పందించిన సాయి తేజ్ “మెగా ఫ్యామిలీలో నేను చరణ్ .. వరుణ్ తేజ్ లతో ఎక్కువ చనువుగా వుంటాను. ఇక స్టైలింగ్ కి సంబంధించిన సలహాలు . . సూచనల కోసం బన్నీని కలుస్తుంటాను. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు .. అందరం కలిసిపోయే ఉంటాము. చిన్నప్పటి నుంచి మేమంతా కలిసి పెరిగిన వాళ్లం. పండుగలన్నీ కలిసే జరుపుకున్న వాళ్లం. చరణ్ .. బన్నీ బయట స్టార్స్ అయినా, ఇంటికి వెళితే ఆ స్టార్ డమ్ ను పక్కన పెట్టేసి ఎప్పటిలానే హ్యాపీగా మాట్లాడతారు. నాకు .. బన్నీకి మధ్య మనస్పర్థలు అనే మాట ఇండస్ట్రీలో షికారు చేస్తుందంటే అదంతా పుకారేగానీ, అందులో ఎంతమాత్రం వాస్తవం లేదు” అని క్లారిటీ ఇచ్చారు.

Related posts