బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షోతో సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను కమెడియన్లుగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే ఇందులో ఉన్న నటులు మాత్రం ఓ రేంజ్‌లో సంపాదిస్తున్నారు. ఓ వైపు జబర్దస్త్ షోతో పాటు బయట కూడా కార్యక్రమాలు చేసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తున్నారు వాళ్లు. ముందుగా రోజా ఒక్కో ఎపిసోడ్‌కు దాదాపు 3 నుంచి 4 లక్షలు తీసుకుంటుందని తెలుస్తుంది. నెలకు 8 ఎపిసోడ్లు ఉంటాయి కాబట్టి అక్షరాలా 16 లక్షల వరకు రోజాకు అందుతున్నాయన్నమాట. ఇక నాగబాబు కూడా 20 లక్షల వరకు సంపాదిస్తున్నాడని తెలుస్తుంది. ఎపిసోడ్‌కు దాదాపు 4 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నాడు మెగా బ్రదర్. యాంకర్లలో రష్మి, అనసూయ ఎపిసోడ్ కు 50 నుంచి 80 వేలు అందుకుంటున్నారని తెలుస్తుంది. వీళ్ల నెల ఆదాయం 3.5 లక్షల వరకు ఉంది. ఇక టీమ్ లీడర్ల విషయంలో చమ్మక్ చంద్ర అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని తెలుస్తుంది. ఈయన 3 నుంచి 4 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇక ఈయన తర్వాత సుడిగాలి సుధీర్ 3 నుంచి 3.5 లక్షలు అందుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇక సుధీర్ టీమ్‌లో ఉండే గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ 2.5 నుంచి 3 లక్షల వరకు పారితోషికం అందుకుంటున్నారు. సాఫ్ట్ వేర్ నుంచి వచ్చిన అదిరే అభి 2.5 నుంచి 3 లక్షల వరకు సంపాదిస్తున్నారని తెలుస్తుంది. హైపర్ ఆది 3 లక్షలు వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడనే ప్రచారం జరుగుతుంది. రాకెట్ రాఘవ 2.5 లక్షలు.. కిరాక్ ఆర్పీ 2.4 లక్షలు.. భాస్కర్ అండ్ టీం 2 లక్షలు.. చలాకీ చంటి 2 లక్షల వరకు సంపాదిస్తున్నారని తెలుస్తుంది. వాళ్ళతో పాటు సునామీ సుధాకర్, ముక్కు అవినాష్, కెవ్వు కార్తిక్ కూడా లక్షల్లోనే సంపాదిస్తున్నారని తెలుస్తుంది.