సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించే విధానానికి స్వస్తి చెప్పబోతున్నట్లు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రభుత్వమే సినిమా టికెట్లను విక్రయించే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వమే నేరుగా టికెట్లను విక్రయిస్తే అందరికీ లాభముంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కొత్త విధానం వల్ల నిర్మాతలకు, పంపిణీదారులకు ప్రయోజనం ఉంటుందని ఆయన అన్నారు. కుటుంబాలతో సంబంధం లేకుండా ప్రతిభావంతులే హీరోలవుతారని ఆయన ఈ సందర్భంగా అన్నారు. రేస్‌కోర్స్ ట్యాక్స్‌పై స్పెషల్ డ్రైవ్ చేశామనీ, గతంలో లక్షల్లో కట్టే పన్ను ఇపుడు కోట్లల్లో కడుతున్నారనీ, ఇలాంటి వ్యవస్థను పూర్తిగా మారుస్తామని ఆయన అన్నారు.
ఏబీఎన్, టీవీ5 ఛానళ్లను ఎందుకు ఆపారో మంత్రులు చెప్పాలి: దేవినేని