హైదరాబాద్ నగరంలో కరోనా అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల ఆరోగ్యరీత్యా మెట్రోరైలు బోగీలను పరిశుభ్రంగా ఉంచాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా సూచించారు. కేటీఆర్ సూచనతో మెట్రో అధికారులు వెంటనే రంగంలోకి దిగారు.
మెట్రో సిబ్బంది బోగీలను కడిగి శుభ్రం చేశారు. బోగీలలోని సీట్లు, హ్యాండిల్స్, ద్వారాలను శుభ్రం చేశారు. మెట్రో పరిసరాలు, రైళ్లు అన్నింటినీ పరిశుభ్రంగా ఉంచుతున్నామని అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఎవరూ ఆందోళన చెందాల్సిన భయపడాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు.