ట్విట్టర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్ డార్సే కూడా హ్యాకర్లబారిన పడ్డాడు. డార్సే అకౌంట్ తామే హ్యాక్ చేశామంటూ చెక్లింగ్ స్క్వాడ్ అనే గ్రూపు ప్రకటన చేసింది. జాక్ ట్విట్టర్ అకౌంట్‌కు సుమారు 40 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే సుమారు 15 నిమిషాలు పాటు అత్యంత హేయమైన ట్వీట్లు డార్సే అకౌంట్ నుంచి పోస్టు అయ్యాయి. చివరకు సైట్‌ను మళ్లీ ఆధీనంలోకి తీసుకువచ్చినట్లు ట్విట్టర్ ప్రకటన చేసింది. అకౌంట్‌ను సెక్యూర్ చేశామని, ట్విట్టర్ సిస్టమ్స్ బాగానే ఉన్నట్లు ఆ సంస్థ చెప్పింది. డార్సే అకౌంట్ నుంచి జాత్యాంహకార ట్వీట్లు వెల్లువలా పోస్టు అయినట్లు తెలుస్తోంది.
వాటిని రీట్వీట్ చేసినట్లుగా కూడా పోస్టులు ఉన్నాయి. నాజీల ఊచకోతకు సంబంధించిన ట్వీట్లు ఎక్కువగా ఉన్నట్లు ఓ నిర్ధారణకు వచ్చారు. ట్విట్టర్ సంస్థ ప్రధాన కార్యాలయంలో బాంబు ఉన్నట్లు కూడా బెదిరంపు ట్వీట్స్ వచ్చాయి. చక్లింగ్ స్క్వాడ్ అనే హ్యాకర్స్ ఇటీవల పదేపదే హై ప్రొఫైల్ అకౌంట్లను హ్యాక్ చేశారు. ట్విట్టర్ కొన్నేళ్ల నుంచి క్లౌడ్‌హోపర్ ఫ్లామ్‌ఫామ్‌ను వాడుతున్నది. అయితే ఆ ఫ్లాట్‌ఫామ్ నుంచి ఏదైనా హ్యాక్ అయి ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు: మంత్రి బొత్స