వైసీపీ అధినేత వైఎస్ జగన్ దోచుకున్నది దాచుకోవడానికే స్విట్జర్లాండ్ వెళ్లారని .టీడీపీ నేత, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు.. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ బంగారాన్ని కూడా వైసీపీ రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. ఏపీలో ఏం జరిగినా రాబందుల్లా బయటికి వచ్చిన వారు తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు మరణిస్తే ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు.
ఏపీలో విద్యార్థుల గురించి మాట్లాడిన పెద్ద మనుషులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.ఏపీలో ఏదైనా చిన్న తప్పు జరిగి విద్యార్థి ఏమైనా చేసుకుంటే మమ్మల్ని, మా అధికారుల్ని, మా ప్రభుత్వాన్ని, మా పార్టీని, మా మంత్రుల్ని బతకనిచ్చేవాళ్లా అని ప్రశ్నించారు. గవర్నర్ దగ్గరికో, రాష్ట్రపతి దగ్గరికో, ప్రధాని దగ్గరికో వెళ్లి మెమొరాండాలు ఇచ్చేవాళ్లు అని దుయ్యబట్టారు. ఈ రోజు ఎందుకు మాట్లాడటం లేదని ఆ పెద్ద మనుషుల్ని నిలదీస్తున్నానని ఆయన అన్నారు.