తెలంగాణ ఇంటర్ బోర్డు వివాదంపై సీఎం కేసీఆర్ ఎట్టకేలకు స్పందించారు. బుధవారం నాడు కార్యాలయంలో సంబధిత ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, ఇంటర్ బోర్డు సెక్రటరీ ఆశోక్ పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇంటర్ ఫలితాలపై నెలకొన్న వివాదాలపై ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదికను రెండు రోజుల్లో ఇచ్చే అవకాశం ఉంది.
ఈ నెల 18న విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాల అవకతవకలతో ఇప్పటికే 20కు పైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాలు హైద్రాబాద్ ఇంటర్ బోర్డు వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ తరుణంలో సీఎం సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకొంది. ఈ సమావేశంలో ఈ వివాదంపై కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.