telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఓపెన్ నాలాలు ఆక్రమణలకు గురయ్యాయి : కిషన్ రెడ్డి

kishanreddy on ap capital

హైదరాబాద్ లో ఓపెన్ నాలాలు ఆక్రమణలకు గురయ్యాయి అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. చెరువుల నిర్వహణ సరిగా లేదు… మూసి,గండి పేట గేట్లు ఎత్తడంలో ఇబ్బంది పడ్డాం.. ముందస్తు చర్యలు తీసుకోవడం లో వెనక పడ్డాం అని తెలిపారు. మూసి ఆక్రమణలకు గురి అవుతుంది. అలా అయితే ఇబ్బందికి గురయ్యేది పేద ప్రజలే.. ఓటు బ్యాంకు పాలిటిక్స్ కరెక్ట్ కాదు.. పైప్ లైన్ లు మూసుకుపోయాయి అన్నారు. శాశ్వత పరిస్కారం గురుంచి ఆలోచించాల్సి ఉంది.. రాజకీయ పార్టీలు, టెక్నికల్ నిపుణులతో సమావేశాలు నిర్వహించాలి.  హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడు కోవాలి…నగర  బిడ్డల కష్టాల నుండి కాపాడాలి. డబ్బులు పంచడం వలన మేలు జరగదు అని చెప్పారు.

ప్రజలు డబల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వర్ష బాధితుల సహాయం అందరికి అందేలా చూడాలి కేంద్ర బృందం రాష్ట్రం లో పర్యటిస్తుంది.. అందరితో సమావేశం అవుతుంది అన్నారు. విజ్ఞప్తులు స్వీకరిస్తుంది… కేంద్ర ప్రభుత్వం కి రిపోర్ట్ ఇస్తుంది. నేను మోడీ,అమిత్ షా లను రిక్వెస్ట్ చేయడం వల్లనే కేంద్ర బృందాలు తొందరగా తెలంగాణకు వచ్చాయి అని తెలిపారు. ఏమర్జెన్సీ కింద sdrf నిధులు వాడుకోవాలి..  ఈ నిధుల్లో 75శాతం కేంద్రం 25 శాతం రాష్ట్ర వాటా ఉంటుంది. అనవసరంగా కేంద్రం ఇవ్వలేదని అనడం సరికాదు అన్నారు.తెలంగాణ కి నిధులు తప్పక వస్తాయి. నేను గమనించిన అంశాలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను అన్నారు.

విపత్తుల వల్ల నష్టం జరిగితే పరిహారం సంబంధించి 2015 లో నార్మ్స్ తయారు చేసింది. ఏ రాష్ట్రం,ఏ పార్టీ అని చూడకుండా నిబంధనల మేరకు కేంద్రం సహకారం అందిస్తుంది. వాళ్ళు రాజకీయాలు మాట్లాడుతారు.. నేను రాజకీయాలు మాట్లాడదల్చుకోలేదు అని చెప్పారు. దుబ్బాక ,ghmc ఎన్నికల్లో రాజకీయాలు మాట్లాడుకుందాం. రాష్ట్ర మంత్రులు తొందర పాటు దుందుడుకు చర్యలతో విమర్శలు చేయొద్దని కోరుతున్న అన్నారు. ఆక్రమణల విషయంలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది… ఓటుబ్యాంక్ రాజకీయాలతో ఆక్రమణ ల విషయంలో ద్వంద విధానం కరెక్ట్ కాదు అన్నారు

Related posts