telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

వ్యాక్సిన్ విషయంలో ఆ పుకార్లు నమ్మొద్దు : ప్ర‌భుత్వం

Corona

కరోనా వ్యాక్సిన్ పై ఎప్పటి నుండో పుకార్లు షికారు చేస్తున్నాయి.. దీనిపై స్పందించిన ప్ర‌భుత్వం.. ఆ వైరలవుతున్న పుకార్లను తోసిపుచ్చింది… ఇలాంటి పుకార్లపై ఎటువంటి ఆందోళ‌న‌ చెందవద్దని ప్రభుత్వం ప్రజలకు పూర్తి  భరోసా ఇచ్చింది.. కోవాక్సిన్ అనేది  ఉత్తేజం లేని వ్యాక్సినే తప్ప శక్తి లేనిది కాద‌ని పేర్కొన్న ప్ర‌భుత్వం.. కోవిషీల్డ్ అనేది వైరల్ వెక్టార్ వ్యాక్సినే కానీ శక్తి లేనిది కాద‌ని స్ప‌ష్టం చేసింది.. ఇందులో SARS Cov2 వైరస్ లేదు.. ఇందులో కేవలం SARS Cov2 యొక్క జన్యు పదార్ధంలో కొంత భాగం మాత్రమే ఉంటుంద‌ని.. ఈ రెండు వ్యాక్సిన్లలో ఏ ఒక్కటీ ఆర్‌టీపీసీఆర్ పాజిటివ్‌కు దారితీయ‌ద‌ని.. వ్యాక్సినేషన్ త‌ర్వాత ఆర్‌టీపీసీఆర్ లో పాజిటివ్ నిర్ధారణ అయితే, వారిలో కోవిడ్ వ్యాధి ఉనికి ఉందని అర్థ‌మంటూ క్లారిటీ ఇచ్చింది. అంతేకానీ వ్యాక్సినేషన్ కారణంగా ఈ పాజిటివ్ వచ్చినట్టు కాద‌న్నారు.. కోవిడ్ వ్యాక్సినేషన్ తరువాత జ్వరం వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స‌ర్కార్ తెలిపింది.

Related posts