గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. వైరస్‌ను అరికట్టేందుకు ఎన్నో రకాల చర్యలతో కట్టడిలోకి వచ్చింది.ఎన్నో రకాల చర్యలతో కట్టడిలోకి వచ్చింది. సెకండ్ వేవ్ తర్వాత థర్డ్‌వేవ్ వచ్చే అవకాశాలున్నాయని ఇప్పటికే పరిశోధకులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక మొన్న ఆల్ఫా.. నిన్న డెల్టా.. నేడు మ్యూ.. ప్రపంచాన్ని కొవిడ్ వేరియంట్లు పట్టిపీడిస్తున్నాయి
ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ నడుస్తున్న సమయంలో దాదాపు చాలామందికి కరోనా వచ్చి ఇప్పటికే తగ్గిపోయి ఉంటుంది. వచ్చిన వారికే మళ్లీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే.. ఒకసారి కరోనా వచ్చి తగ్గిన తర్వాత చాలామందిలో కరోనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నప్పటికీ మునుపటిలా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండలేకపోతున్నారట. అయితే.. కరోనా వచ్చి తగ్గిన చాలామందిలో కనిపిస్తున్న ప్రధాన సమస్య జుట్టు రాలడం. కరోనా తగ్గిన తర్వాత జుట్టు రాలడానికి నిపుణులు పలు కారణాలు చెప్తున్నారు.
కరోనా వల్ల తీవ్ర ఒత్తిడికి గురై.. తిరిగి మామూలు స్థితికి చేరుకోవడం వలన బాడీలో చాలా మార్పులు జరుగుతాయట. ఆ సైడ్ ఎఫెక్ట్స్ లో జుట్టు రాలడం కూడా ఒకటి. ఒత్తిడికి గురి కావడం వల్ల మెదడు మీద ఎక్కువ భారం పడి.. తలపై ఉండే వెంట్రుకల మీద ప్రభావం చూపిస్తుందట. తలలో ఇన్ఫెక్షన్ ఏర్పడి.. మంటగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయట. శరీరం లో విటమిన్ బి 12, విటమిన్ డి స్థాయులు కూడా తగ్గిపోతాయట.
దీంతో జుట్టు రాలడం, పెలుసుబారడం, జీవం లేనట్టుగా మారడం, బలహీన పడటం వంటివి కనిపిస్తాయట. వీలైనంత ఎక్కువగా పోషకాహారాలు తీసుకుంటూ.. నూనెతో జుట్టు నిత్యం మృదువుగా మర్దన చేస్తే జుట్టు రాలకుండా కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు. తలస్నానం చేసేటప్పుడు నీళ్లు ఎక్కువ వేడిగా, ఎక్కువగా చల్లగా ఉండకుండా చూసుకోవాలి. తల తుడిచేటప్పుడు కూడా మెల్లిగా తుడవాలి. హెయిర్ డ్రయ్యర్లు వాడకపోవడమే బెటర్ అంటున్నారు.
కాగా.. ఈ కొత్త రకాన్ని ‘వేరియంట్ఆఫ్ ఇంట్రెస్ట్’గా గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో కరోనా మ్యూ వేరియంట్ గుర్తించారు పరిశోధకులు. వ్యాక్సిన్లకు లొంగని డేంజర్ వేరియంట్ పై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. కొలంబియాలో బయటపడ్డ మ్యూ వేరియంట్ యూరప్, అమెరికా, బ్రిటన్‌లో కూడా వ్యాప్తి చెందినట్లు గుర్తించారు.