telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

తెలంగాణా సీఎస్ కు కేరళ సీఎస్ లేఖ..కారణమిదే

ayyappa

తెలంగాణా సీఎస్ సోమేశ్ కుమార్ కు కేరళ సీఎస్ లేఖ లేఖ రాశారు. శబరిమల ఆలయంలో నెయ్యి అభిషేకం, పంపానదిలో స్నానాలకు అనుమతి లేదని కేరళ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌కు కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. వర్చువల్‌ క్యూపోర్టల్‌ ద్వారా దర్శనం కోసం భక్తుల నమోదు తప్పనిసరని పేర్కొన్నారు. https://sabarimalaonline.org అనే పోర్టల్ లో నమోదు చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.

తొలుత రోజుకు వెయ్యి, వారాంతంలో రోజుకు రెండు వేల మంది భక్తులకు మాత్రమే అనుమతినిస్తామని తెలిపారు. దర్శనానికి 48 గంటల ముందు కొవిడ్‌ నెగటివ్‌ నిర్ధారణ పరీక్ష తప్పనిసరి అని స్పష్టం చేశారు. పదేళ్ల లోపు, 60 ఏళ్లకు పైబడిన వారికి దర్శనానికి అనుమతి లేదని కేరళ ప్రభుత్వం తెలిపింది. కాగా కరోనా నేపథ్యంలో దేశంలోని అన్ని దేవాలయాలకు కొన్ని ఆంక్షలతో…భక్తులకు అనుమతి ఇస్తున్నారు. తెలంగాణా సీఎస్ సోమేశ్ కుమార్ కు కేరళ సీఎస్ లేఖ లేఖ రాశారు. 

Related posts