కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డకట్ట వేయడం కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నడుస్తుండటంతో ఇప్పటికే ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ఆరు నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు లేకుండా పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించాయి. కరోనా, లాక్‌డౌన్ కారణంగా తెలుగు రాష్ట్రాలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. హైకోర్టు జోక్యంతో తెలంగాణలో పది పరీక్షలు వాయిదా పడ్డాయి. టెన్త్ విద్యార్థులకు కచ్చితంగా పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ సర్కారు తాజాగా ప్రకటించింది. తాజాగా సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులందర్నీ ఉత్తీర్ణుల్ని చేసినట్లు ప్రకటించింది. ఎలాంటి పరీక్షలు లేకుండానే వారంతా పై తరగతులకు ప్రమోట్ అయ్యారని సీబీఎస్ఈ తెలిపింది. మరోవైపు 9వ తరగతి, 11వ తరగతి విద్యార్థులకు ఇప్పటి వరకు నిర్వహించిన ప్రాజెక్ట్ వర్క్, నెలవారీ పరీక్షలు, టెర్మ్ ఎగ్జామ్స్, ఇంటర్నల్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా పై తరగతులకు ప్రమోట్ చేయనున్నారు. కేంద్ర మానవ వనరుల మంత్రి డాక్టర్ రమేశ్ పోఖ్రియాల్ సూచనల మేరకు విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తూ సీబీఎస్ఈ నిర్ణయం తీసుకుంది. ప్రమోట్ కాని విద్యార్థులు పాఠశాలలు నిర్వహించే ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ టెస్టుకు హాజరు కావచ్చని మంత్రి తెలిపారు.
previous post
జగన్ పాలన చూసి నారా వారి నరాలు చిట్లిపోతున్నాయి: రోజా