telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణకు ఎక్కువ వ్యాక్సిన్‌ డోసులు ఇవ్వండి : ఈటల

నేషనల్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్ ను ఇవాళ మంత్రి ఈటల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడారు. హెల్త్ కేర్ రంగానికి కేంద్రం బడ్జెట్ పెంచాలని..తెలంగాణకు ఎక్కువ వాక్సిన్ డోసులు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ లో వాక్సిన్ తయారువుతున్న నేపథ్యంలో తమకు ఎక్కువ డోసులు ఇవ్వాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ను కోరారు మంత్రి ఈటల. అందుబాటులో ఉన్న మెడిసిన్ ను ప్రజలకు అందించటమే మా కర్తవ్యమని.. కట్టడి చేసే హక్కు ఎవరికి లేదన్నారు. ప్రభుత్వ పరంగా అల్లోపతి ఆస్పత్రుల కంటే గతంలో ఆయుర్వేద ఆస్పత్రులు ఉండేవని.. అనేక కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆయుర్వేద డాక్టర్లు డ్యూటీ చేస్తున్నారని తెలిపారు. వైద్య విద్యలో థియరీ క్లాసులతో పాటు ప్రాక్టీకల్ క్లాసులు ముఖ్యమేనని.. కోవిడ్ సందర్భంగా ఆయుర్వేద వైద్యానికి గుర్తింపు తేవాలని కేంద్రం చెప్పిందని పేర్కొన్నారు. ట్రీట్మెంట్ కోసం ఖర్చు పెట్టలేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారని.. శాస్త్ర విజ్ఞానం పెరిగింది కానీ ప్రజలకు తక్కువ ధరకు వైద్యం అందటం లేదని వెల్లడించారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందాలి.. ఇది అందరి హక్కు అని పేర్కొన్నారు.

Related posts