చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ తన అభిమానులకు హృదయపూర్వక సందేశాన్ని పోస్ట్ చేశాడు, అతను ఎప్పుడూ తన జట్టును ప్రేమిస్తాను అని మరియు తన సహచరులకు పానీయాలు తీసుకెళ్లడం నా పనే అని చెప్పాడు. ఐపీఎల్ 2020 లో వరుసగా 8వ మ్యాచ్ లో బెంచ్ కు పరిమితమైన తరువాత తాహిర్ ఈ విధంగా సందేశం ఇచ్చాడు. “నేను ఆడుతున్నప్పుడు, చాలా మంది ఆటగాళ్ళు నా కోసం పానీయాలు తీసుకువెళ్లారు. ఇప్పుడు అర్హత ఉన్న ఆటగాళ్ళు మైదానంలో ఉన్నప్పుడు డ్రింక వారికి తిరిగి ఇవ్వడం నా కర్తవ్యం” అని ఇమ్రాన్ తాహిర్ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. అలాగే నాకు అవకాశం వస్తే నేను నా వంతు కృషి చేస్తాను అని తెలిపాడు.
ఐపిఎల్ 2019 లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున పర్పుల్ క్యాప్ గెలుచుకున్న ఇమ్రాన్ తాహిర్ 26 వికెట్లు పడగొట్టాడు. ప్రముఖ దక్షిణాఫ్రికా స్పిన్నర్ గత ఏడాది ఎంఎస్ ధోని ఫ్రాంచైజీ కోసం మొత్తం 17 మ్యాచ్‌లు ఆడాడు. అయితే, కొద్దిమందిని ఆశ్చర్యపరిచే విధంగా, తాహిర్ ఈ సీజన్‌లో చెన్నై కోసం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. గత మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ పై గెలిచిన సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ 3 స్పిన్నర్లను ఆడించింది. కానీ అందులో ఇమ్రాన్ తాహిర్‌కు చోటు దక్కలేదు.