telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

వాట్సప్‌లో సాంకేతిక లోపం..యూజర్ల ఇబ్బందులు

whatsapp

కొత్త ఫీచర్లతో అప్‌డేట్స్‌ను అందించే వాట్సాప్‌ లో ఈ రోజుసాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఈ రోజు తెల్లవారు జామున 3 గంటల ముందు దాదాపు గంట సేపు ఆ యాప్‌ పని చేయలేదు. ఆ సమయంలో ఆ యాప్‌ను వాడడానికి ప్రయత్నించిన యూజర్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

200 కోట్ల మంది యూజర్లందరి మొబైల్ ఫోన్లలో వాట్సప్‌ పని చేయట్లేదు. అనంతరం వాట్సప్ సిబ్బంది సాంకేతిక సమస్యను పరిష్కరించి, సర్వీసును తిరిగి పునరుద్ధరించారు. ఈ సాంకేతిక సమస్య వల్ల దాదాపు గంట సేపు వాట్సప్‌ యూజర్లు సందేశాలు పంపలేకపోయారు. ముఖ్యంగా అమెరికా, యూకేల్లో యూజర్లు చాలా సేపు అసౌకర్యానికి గురయ్యారు.

ఆ సమయంలో వాట్సప్‌ యాప్‌ ఓపెన్‌ అయి, పాత మెసేజ్‌లు కనపడినప్పటికీ, కొత్తవి పంపలేకపోయారని నిపుణులు వివరించారు. ప్రస్తుతం తిరిగి వాట్సప్‌లో ఎప్పటిలాగే సేవలు కొనసాగుతున్నాయి. వాట్సప్‌లో ఓ ఇంటర్నల్‌ అప్‌డేట్‌ కారణంగా ఈ రోజు తెల్లవారుజామున యూజర్లకు ఈ అసౌకర్యం కలిగిందని వాట్సప్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

Related posts