ఏలూరులో అస్వస్థతకు గురవుతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. నగరంలోని పది ప్రాంతాలకు చెందిన వారు… స్పృహ కోల్పోవడం, మెడ, నడుం నొప్పి, తల కళ్లు తిరగడం లాంటి లక్షణాలతో మొన్న శనివారం మధ్యాహ్నం నుంచి నిన్న రాత్రి వరకు ఆస్పత్రులకు వస్తూనే ఉన్నారు. ఇప్పటికే బాధితుల సంఖ్య కాస్త 550 దాటింది. అయితే… అయితే.. తాజాగా ఈ వింత వ్యాధితో మరో ఇద్దరు మృతి చెందారు. విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితులు మృత్యువాతపడ్డారు. వింత వ్యాధితో బాధపడుతున్న 30 మందిని విజయవాడ ఆస్పత్రికి తరలించగా… పరిస్థితి విషమించడంతో సుబ్బరావమ్మ [56], అప్పారావు {50} మృతి చెందారు. అయితే.. మృతురాలు సుబ్బరావమ్మ కరోనాతో… మృతుడు అప్పారావు ఊపిరితిత్తుల సమస్య కూడా ఉందని వైద్యులు వెల్లడించారు. వింత వ్యాధితో బాధపడుతూ ఈ నెల 6న శ్రీధర్ మృతి చెందిన విషయం తెలిసిందే… అయితే ఈ ఘటనపై సీఎం జగన్ ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు. అధికారులను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు.
previous post
next post
ముస్లింలపై విరుచుకుపడటం తగదు..మోదీపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు