telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

నా హృదయమా…. నీవే నాప్రాణమని మరువకు

మాటలకందని బావాలేవో
మనసుని మెలిపెడుతుంటే
మనసు కందని ఊహలేవో
మదిని కలవర పెడుతున్నాయి
జయించలేని ఆలోచనలతో
హృదయం తల్లడిల్లుతుంది
అంతులేని నా ప్రేమ ప్రవాహంలో
నీవు అల్లాడి పోతుంటే
అరుదైన మౌనమేదో
నీతో దోబూచులాడుతున్నట్టుంది
కలకానిది కలవరంలేని
నా మనోనివేదన
మీకే కదా సొంతం
అపురూపమైన ఈ క్షణం కోసమే
కదా నా అన్వేషణ
నీవు లేని ఈ లోకం
నాకు అమావాస్యే కనుక
కలలో సైతం నీవు నాకు
దూరమయ్యే ప్రయత్నం చేయకు నేస్తం
నా హృదయమా
నీవే నాప్రాణమని మరువకు
……………………………
నాశ్వాస నీవై నీ ఊపిరి నేనై
వుండి పోవాలని వుంది
కలలోసైతం కలిసుండాలని కోరుకుంటున్నా
మీ మమతలోని మాధుర్యాన్ని మరువకున్నా
క్షణమైనా నిను విడిచి వుండలేకున్నా

Related posts