telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భారీగా ఫాలోవర్లను కోల్పోతున్న కంగనా…!!

Kangana

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసు తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసే విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఇండస్ట్రీలో నేపోటిజం రాజ్యమేలుతోందని, బ్యాగ్రౌండ్ లేని నటులను తొక్కేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్న వేళ డ్రగ్స్ డీలర్లతో బాలీవుడ్ నటులకు సంబంధాలున్నాయని తెలుస్తుండటం జనాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో నెపోటిజంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోన్న హీరోయిన్ కంగనా రనౌత్‌పై పబ్లిసిటీ కోసమే ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటుందని పలువురు ప్రముఖులు విమర్శిస్తున్నారు. తాజాగా నెపోటిజంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తోన్న కంగనాకు అన్‌ఫాలో చేస్తూ ఆమెకు నెటిజన్లు షాక్ ఇచ్చారు. ప్ర‌తి రోజు దాదాపు 50 వేల మంది ఫాలోవర్లను కోల్పోతున్నారని ఓ నెటిజన్ కంగనాకు ట్వీట్ చేశాడు. తనలాంటి జాతీయవాదులు ప్రతి చోట కష్టపడాల్సి వస్తుందని, రాకెట్ చాలా బ‌లంగా ఉందని కంగనా రనౌత్ చెప్పుకొచ్చింది. తనను అన్‌ఫాలో చేసిన వారికి హృద‌య‌పూర్వ‌క క్ష‌మాప‌ణలు చెబుతున్నానంటూ పేర్కొంది.

Related posts