telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ గా జేసీ ప్రభాకర్‌రెడ్డి…

ఏపీలో వరుస ఎన్నిక్లను జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యే ముగిసిన మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఫలితాలు వచ్చిన తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక మాత్రం జరగలేదు. కానీ ఇప్పుడు ఆ ఉత్కంఠకు తెరపడింది. అనూహ్య పరిణామాల మధ్య ఈ మున్సిపాలిటీ టీడీపీ వశం అయింది. ఈ కైవసం చేసుకుంది. మున్సిపల్‌ ఛైర్మన్‌ గా టీడీపీ కౌన్సిలర్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. వైస్‌ ఛైర్మన్‌గా సరస్వతిని ఎన్నుకున్నారు. టీడీపీకి ఉన్న 18 మంది కౌన్సిలర్ల బలానికి తోడు సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు మద్దతు ఇవ్వడంతో ప్రభాకర్‌రెడ్డి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. మూడు రోజుల కిందట ఎమ్మెల్సీల ఎక్స్‌అఫీషియో ఓట్లను మున్సిపల్‌ కమిషనర్‌ తిరస్కరించిన నాటి నుంచి ఈ ఛైర్మన్‌ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎన్నికతో దీనికి తెరపడింది. ఇక తాడిపత్రి మున్సిపల్ ఛ్తెర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అవసరమైతే సీఎం జగన్ ను కలుస్తానని, సేవ్ తాడిపత్రి నినాదంతో ముందుకు వెళతనాని అన్నారు.

Related posts