telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

15 ఏళ్ళకే పెళ్ళి చేసుకుని… డాడీ అని పిలవమని వేధించాడు : ప్రముఖ సింగర్ పై ఆరోపణలు

Kelly

మీటూ దుమారం ఇండియా కన్నా ముందే విదేశాల్లో దుమారం రేపింది. అక్కడ కూడా సినీ సెలబ్రిటీలు తమకు ఎదురైన చేసు అనుభవాలను ధైర్యంగా బయటపెడుతున్నారు. ప్రముఖ అమెరికన్ సింగర్ ఆర్ కెల్లీపై ఓ యువతి చేస్తున్న లైంగిక ఆరోపణలు హాలీవుడ్‌లో వివాదాస్పదమైంది. సావేజ్ అనే 24 ఏళ్ల యువతి కెల్లీ గురించి నమ్మలేని నిజాలను బయటపెట్టారు. “2015లో ఓ కాన్సర్ట్‌లో నేను కెల్లీని కలిశాను. ఆయన నాకు కూడా పాడే అవకాశం ఇస్తారేమో అనుకున్నాను. నన్ను, నా స్నేహితురాలిని తనతో పాటు కాలిఫోర్నియాకు తీసుకెళ్లాడు. నన్ను గొప్ప మోడల్, సింగర్‌ని చేస్తానని హామీ ఇచ్చాడు. దాంతో అతని మాటలు నమ్మి వెళ్లాం. అయితే నేను ఆయన్ను కలిసిన ప్రతీసారి నన్ను సెక్సువల్‌గా చూసేవాడు. ఆ తర్వాత మాయ మాటలు చెప్పి నాకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడే నన్ను పెళ్లి చేసుకున్నాడు. నా ఖర్చులన్నీ అతనే భరించాడు. ఆ తర్వాత అతని స్టూడియోలో కొన్ని పాటలను రికార్డ్ చేశాను. కానీ అవేవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు. దాంతో ఏదో ఒకటి చెప్పి ధైర్యంగా ఉండమనేవాడు. అయితే అదంతా ప్రేమతోనే చేస్తున్నాడు అనుకుని నాకూ అతనిపై ప్రేమ కలిగింది. కానీ కొన్ని నెలల తర్వాత అతనిలోని రాక్షసుడిని చూశాను. నన్ను మాస్టర్ అని పిలువు లేదా డ్యాడీ అని పిలువు, అంతేకానీ భర్త అనకు అని బెదిరించేవాడు. అతను నన్ను పిలిచిన ప్రతీసారీ చెప్పండి డ్యాడీ అంటుండాలి. లేకపోతే మానసికంగా, శారీరకంగా హింసించేవాడు. రోజురోజుకీ అతని ఆగడాలు ఎక్కువైపోయాయి” అని వెల్లడించారు. అయితే ఈ ఆరోపణలపై కెల్లీ తరఫు న్యాయవాది డబ్బు కోసం ఆమె కెల్లీపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని తెలిపారు. సావేజ్ తన గురించి చెప్తున్నవన్నీ అబద్ధాలేనని కెల్లీ కూడా మీడియా ముందు వెల్లడించాడు.

Related posts