telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

నేటితో ముగియ‌నున్న ఎల్ఆర్ఎస్ గ‌డువు..

sankranthi holidays in telangana

తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకువచ్చిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ గ‌డువు నేటితో ముగియ‌నుంది. బుధవారం సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా 16,28,844 దరఖాస్తులు వ‌చ్చాయ‌ని అధికారులు చెబుతున్నారు.. ఇందులో కార్పొరేషన్‌ల పరిధిలో 2,91,066, మున్సిపాలిటీల్లో 6,70,085, గ్రామ పంచాయతీల పరిధిలో 6,67,693 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. ప్ర‌భుత్వం విధించిన ప్రస్తుత గడువు ఇవాళ్టితో ముగియ‌నుంది. అయితే, ఈ గడువును మ‌రోసారి పొడిగించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.. ఈ నెలాఖరు వరకు ఎస్ఆర్ఎస్ గ‌డువు పొడిగించే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం సాగుతోంది. దీనికి సంబంధించిన ఉత్త‌ర్వులు ఇవాళ జారీ చేసేఅవ‌కాశం ఉంది.

కాగా ఎల్‌ఆర్‌ఎస్‌ కింద 2015లో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నిబంధనలు, షరతులు అన్ని ఒకేవిధంగా ఉన్నందున పెండింగ్‌ దరఖాస్తులను ప్రస్తుత ఎల్‌ఆర్‌ఎస్‌ బోర్డులోకి తీసుకునేందుకు మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ అనుమతి ఇచ్చారు. నిబంధనల ప్రకారం వాటిని క్రమబద్ధీకరించాలని కేటీఆర్ సూచించారు. ఈ మేరకు ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం 2015 కింద జనవరి 31,2020 వరకు వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ అధికారులను కేటీఆర్ ఆదేశించారు.

Related posts