ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ కె. హేమచంద్రారెడ్డిని నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు చైర్మన్‌గా ఉన్న ఎస్. విజయరాజు తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జేఎ్‌సవీ ప్రసాద్‌కు అందజేశారు.
2017 జనవరి 2న ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా నియమితులైన విజయరాజు పదవీ కాలం మరో 6 నెలలు ఉన్నప్పటికీ.. ప్రభుత్వం సూచన మేరకు రాజీనామా చేసినట్టు తెలిసింది. హేమచంద్రారెడ్డి ప్రస్తుతం జేఎన్‌టీయూ అనంతపురంలో రిజిస్ట్రార్‌గా, గతంలో జేఎన్‌టీయూ(పులివెందుల) కాలేజీకి ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. ఆర్‌జీయూకేటీ వీసీ రామచంద్రరాజు కూడా రాజీనామా చేశారు.