telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నోటితో పవర్ స్టార్ ఫోటో డ్రా… మహిళా అభిమానికి పవన్ రిప్లై… !

సెప్టెంబ‌ర్ 2న జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ పుట్టిన‌రోజు. ఆరోజు పవన్ అభిమానులు సోషల్ మీడియాలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. #HBDPawanKalyan అనే హ్యాష్ ట్యాప్ ను ట్రెండ్ చేశారు. అయితే పవన్ బర్త్ డే సందర్భంగా స్వ‌ప్న అనే ఓ మ‌హిళా అభిమాని చేసిన ప‌ని అంద‌రినీ సంబ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. స్వ‌ప్న దివ్యాంగురాలు. ఆమెకు రెండు చేతులు లేవు. అయినా కూడా నోటితో ప‌వ‌న్ ఫొటోను డ్రా చేసి, వీడియో ద్వారా ప‌వ‌న్‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. స్వ‌ప్న చేసిన ప‌ని ప‌వ‌న్ దృష్టికి వెళ్ల‌డంతో ఆయ‌న స్పందిస్తూ “మా బంగారు తల్లి స్వప్న, నువ్వు వేసిన నా డ్రాయింగ్ నా దృష్టికి మన జనసైనికులు తీసుకొచ్చారు. చాలా చక్కగా ఉంది తల్లి.. నేను విశాఖపట్నం వచ్చినప్పుడు నిన్ను కలుస్తాను. జాగ్రత్త అమ్మ! ’’ అని ట్వీట్ చేశారు పవన్. ఇక పవన్ తన పుట్టినరోజు సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతిఒక్కరికీ రిప్లై ఇచ్చిన విషయం తెలిసిందే.

Related posts