telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కరోనా కారకులపై చూపించు నీ కోపం

Covid-19

కరోనా గాడు బయటికెళితే వస్తడు 

నఖరాలు చేస్తే ఒళ్లంతా కోస్తడు 

శుభ్రంగా ఉండకపోతే నీ రాత రాస్తడు 

లాపర్వా చేస్తే నీ మృత్యుగీత గీత గీస్తడు 

 

   వినాశనకారియై వచ్చింది కరోనా 

దాన్ని చూసి మనందరం డరోనా 

ఎక్కువైతే ఆసుపత్రిలో భరోనా 

అజాగ్రత్తగా ఉంటే ఇక మరోనా

 

    కరోనా రాకుండా ఇంట్లోనే ఉంటేనే హాయి

శుభ్రతతో ఎల్ల వేళల కాపలా కాయ్

 నీ జాగ్రత్తతోనే నీ జాతకం రాయి

నిర్లక్ష్యం చేస్తే పోతావు భాయి

 

కరోనా కారకులపై చూపించు నీ కోపం

లాక్ డౌన్ తో రోజు వారి కూలీలు అయ్యో పాపం 

కరోనా వ్యాప్తితో పెరిగింది ప్రజల్లో తాపం

అందుకే దేశసౌభాగ్యం కోసం వెలిగించు దీపం 

 

చూడ్డానికి కరోనా చాలా అల్పం 

కాని అది తెచ్చే హాని అనల్పం

విషమించిందా మిగిలింది తల్పం 

శ్రుతి మించితే మాయాబజార్ గిల్పం 

 

కరోనా రాక్షసికి చేయాలి అంతం 

లేకపోతే జరిగే నష్టాలు అనంతం 

అందుకే కలిసికట్టుగా పట్టాలి పంతం 

విదేశీ శక్తులడ్డు వస్తే మేము వారిని తంతం

Related posts