telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీలో బంగారం షాపుల యజమానుల కీలక నిర్ణయం…

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దాంతో ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఉండే మార్కెట్లు కొన్ని క్ర‌మంగా స్వ‌చ్ఛంద లాక్‌డౌన్ విధించుకుంటున్నాయి.. వ్యాపార స‌మ‌యాల‌ను కుదిస్తున్నాయి.. క‌ఠిన చ‌ర్య‌ల‌కు పూనుకుంటున్నాయి.. తాజాగా… గుంటూరు జిల్లా తెనాలిలో కరోనా కేసులు పెరుగుతూ.. ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయి.. దీంతో.. కీలక నిర్ణయం తీసుకున్నారు వెండి, బంగారు నగల వర్తకులు.. ఇవాళ్టి నుంచి ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకే షాపులు మూసివేయాలని నిర్ణ‌యం తీసుకున్నారు.. తెనాలి వెండి, బంగారు నగల వర్తకుల సంఘం, పాన్ బ్రోకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వ‌హించి.. ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.. వ్యాపారస్తులు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, క‌రోనా సెకండ్ వేవ్‌లో రోజుకో రికార్డు త‌ర‌హాలో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతూ ఆందోళ‌న‌కు గురిచేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏపీలో ఈరోజుకు మూడు వేలకు పైగా కరోనా కేసులు వస్తుండటంతో ఇప్పటికే రెండు మండలాల్లో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.

Related posts