telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ నేతలు దున్నపోతుల్లా వ్యవహరించారు: చంద్రబాబు

chandrababu

వైసీపీ నేతలు సభలో దున్నపోతుల్లా వ్యవహరించారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఒక సభలో జరిగే చర్చ.. మరో సభలో వేయడానికి లేదన్నారు. ధర్మాన్ని కాపాడటం మండలి చైర్మన్‌ షరీఫ్ చేసిన తప్పా? అని ప్రశ్నించారు. కౌన్సిల్‌ను మీరే నడపాలని చూస్తారా అని ఆయన నిలదీశారు. చైర్మన్‌ చెప్పినా శాసన మండలి లైవ్‌ ఇవ్వలేదని, మండలిలో జరిగే చర్చను అసెంబ్లీలో ఎలా ప్రదర్శిస్తారు? అని ప్రశ్నించారు.

151 మందిలో 86 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని, ఇలాంటి కరుడుగట్టిన క్రిమినల్స్‌ని పెట్టుకుని.. ఆర్థిక ఉగ్రవాది జగన్‌ రాష్ట్రాన్ని అపహాస్యం చేస్తున్నాడని బాబు ధ్వజమెత్తారు. ప్రపంచంలో ఎక్కడా 3 రాజధానులు లేవని చంద్రబాబు తెలిపారు. జగన్‌ ఒక్కడికే బుర్ర ఉన్నట్లు మాట్లాడుతున్నాడని విమర్శించారు.

Related posts