telugu navyamedia
క్రీడలు వార్తలు

ఆ బంతులతోనే సంజును అడ్డుకున్నాము…

అర్షదీప్‌ మాత్రం తన వైడ్ యార్కర్ బంతులతో శాంసన్‌ను బోల్తా కొట్టించి.. పంజాబ్ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. చివరి బంతికి సిక్సర్ బాదుదామనుకున్న శాంసన్‌ను ఔట్ చేసి.. హీరో అయ్యాడు. ఐపీఎల్‌ 2021లో భాగంగా సోమవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో పంజాబ్‌ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. అనంతరం అర్షదీప్‌ సింగ్ మాట్లాడుతూ… ‘చాలా సంతోషంగా ఉంది. ఆఖరి ఓవర్‌ కన్నా ముందు పిచ్‌ వేగంగా అనిపించింది. ఆ తర్వాత మాత్రం సహకరించింది. చివరి ఓవర్ ఆరు బంతుల్ని ఆఫ్‌సైడ్‌ దూరంగా యార్కర్లు విసరాలన్నది మా ప్రణాళిక. ఫీల్డ్ సెట్ కూడా దానికి అనుగుణంగా చేయబడింది. సంజు శాంసన్‌కు యార్కర్లు వేసేందుకు ప్రయత్నించా. అలాంటప్పుడు అతడు బౌండరీలు మాత్రమే కొట్టగలడు. శాంసన్ సిక్సర్‌ బాదినా.. అదే ప్రణాళికను అమలు చేశా. చివరి బంతిని కూడా అలానే వేశా. కానీ నా గుండె వేగం మాత్రం పెరిగింది. చివరికి క్యాచ్ ఔట్ అయ్యాడు’ అని తెలిపాడు. మా కోచింగ్‌ బృందం, కెప్టెన్‌ నాకు అండగా నిలిచారు. నేనెలాంటి పాత్ర పోషించాల్సి ఉంటుందో సన్నాహక మ్యాచుల్లో వారు నాకు స్పష్టంగా చెప్పారు. దాంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. కెప్టెన్ కోరుకునే విధంగా బౌలింగ్ చేయడమే నా పని. అని అర్షదీప్‌ సింగ్ తెలిపాడు. ఈ మ్యాచులో తన కోటా 4 ఓవర్లలో మూడు వికెట్లు తీసి 35 పరుగులు ఇచ్చాడు.

Related posts