telugu navyamedia
రాజకీయ వార్తలు

జూన్ 1 నుంచి అన్ని ప్రార్థనాలయాలు: మమతా బెనర్జీ

mamatha benerji

ఈ నెలాఖరుతో లాక్ డౌన్ 4.0 ముగియనున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకొంది. జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రార్థనాలయాలను తెరవనున్నట్టు ప్రకటన చేశారు. లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రార్థనా స్థలాలను తెరవనున్న తొలి రాష్ట్రంగా బెంగాల్ నిలవనుంది.

మరోవైపు జూన్ 8వ తేదీ నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలన్నింటినీ పూర్తిగా తెరవాలని మమత ప్రభుత్వం నిర్ణయించింది. గత రెండు నెలలుగా కరోనాను విజయవంతంగా అదుపు చేశామని తెలిపారు. అయితే, ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి జనాలు వస్తుండటంతో తాజాగా కేసులు పెరుగుతున్నాయని మమత తెలిపారు.

Related posts