telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమరావతిలో జరిగిన భూ లావాదేవీలపై దర్యాప్తు: వైఎస్ జగన్

cm jagan ycp

అమరావతిలో జరిగిన భూ లావాదేవీలపై ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తోందని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ మాట్లాడుతూ హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో 1990లో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్ విధానమే మళ్లీ అమరావతిలో జరిగిందని అన్నారు.

చంద్రబాబు, ఆయన మనుషుల బినామీ లావాదేవీలను వెలికి తీసే పనిలో ప్రత్యేక బృందం ఉందన్నారు. రాజధాని నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు కావాలని గత ప్రభుత్వం చెప్పిందని తెలిపారు.

పేద రైతుల నుంచి భూములు కొనుగోలు చేసిన తర్వాతే అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన వెలువడిందన్నారు. అక్కడ భూ కుంభకోణం జరిగిందని చెప్పారు.

కేవలం ఒక వర్గానికి మాత్రమే అమరావతిలో ప్రయోజనం చేకూరిందన్నారు. అభివృద్ధిని రాష్ట్రమంతటికీ విస్తరిస్తే అన్ని చోట్లా భవిష్యత్తులో గ్రోత్ సెంటర్లు అవుతాయని జగన్ వ్యాఖ్యానించారు.

అభివృద్ధి అంతా ఒకే చోట ఉండాలనుకోవడం భావ్యం కాదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. మూడు రాజధానుల ఆలోచన నిజానికి సామాన్యుల ఆలోచన అని జగన్ పేర్కొన్నారు.

విశాఖపట్టణం నుంచి కార్య నిర్వాహక, అమరావతి నుంచి శాసన, కర్నూలు నుంచి న్యాయ వ్యవస్థ విధుల నిర్వహణ జరుగుతుందన్నారు. చెన్నై, హైదరాబాద్ నగరాల్లో అన్నిటినీ ఒకే చోట కేంద్రీకరించడం వల్ల ఏపీ రెండుసార్లు దారుణంగా నష్టపోయిందని అన్నారు.

Related posts