telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మా పాలనను చూసి ఓర్వలేక రెచ్చ‌గొడుతున్నారు..

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు వేడేక్కుతున్నాయి.అటు వైసీపీ నేతలు, ఇటు వైసీపీ నేతలు మధ్య రోజుకో రచ్చ జరుగుతోంది. టీడీపీ అధికార నేత‌ పట్టాభి చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కాక రేగుతున్నాయి. దీంతో వైసీపీ కార్యకర్తలు కర్రలతో టీడీపీ ప్ర‌ధాన కార్యాలయాలపై దాడులకు తెగబడ్డారు. కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్స్‌, అద్దాలు, కుర్చీలన్నీ ధ్వంసం చేశారు.

The TDP office at Mangalagiri in Guntur district, which was attacked on Tuesday.

ఈ దాడుల‌పై స్పందించిన సీఎం వైఎస్‌ జగన్ మంచి పాలనను చూసి కొందరు ఓర్వలేకపోతున్నారని కౌంట‌ర్ ఇచ్చారు. టీడీపీ నేతలు మాట్లాడుతోన్న బూతులను గతంలో ఎవరూ మాట్లాడి ఉండరని , దారుణమైన, పరుష పదజాలం వాడుతున్నారని చెప్పారు. టీవీల్లో బూతులు విని భ‌రించ‌లేని నన్ను ప్రేమించే అభిమానులు తట్టుకోలేకపోవడం వల్ల ఇలాంటి రియాక్షన్ వచ్చిందన్నారు.

“ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఇలా మాట్లాడలేదు. దారుణమైన, పరుష పదజాలం వాడుతున్నారు. కావాల‌నే కులాలు, మతాలు మధ్య చిచ్చుపెడుతున్నారని , రెచ్చగొట్టి, వైషమ్యాలను సృష్టించి రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తున్నారంటూ ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు.

వైసీపీ సర్కారుపై ప్రజల ప్రేమను విప‌క్ష నేత‌లు జీర్ణించుకోలేకపోతోందన్నారు. ఇంతటి అన్యాయమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుని దయ, ప్రజల చల్లని దీవెనలతో రెండున్నర ఏళ్ల పరిపాలన సంతృప్తికరంగా చేయగలిగానని సీఎం జగన్ చెప్పారు. ఇంకా మంచి చేయడానికి కూడా వెనకాడనన్నారు సీఎం.

Terrorising judiciary, bench-hunting' — How Andhra CM's charges against SC  judge are being seen

ప్రజలకు ఎలాంటి మేలు జరగకూడదు.. ప్రభుత్వ పథకాలు అమలు కాకూడదు.. అలా జరిగితే ప్రజలకు లబ్ధి చేకూరుతుంది.. సీఎం జగన్‌కు మంచి పేరు వస్తుంది.. తమకు మనుగడ ఉండదన్న భయంతోనే.. వాటిని అడ్డుకోవాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు

“ వైసీపీ సర్కారుపై ప్రజల ప్రేమను విప‌క్ష నేత‌లు జీర్ణించుకోలేకపోతోందన్నారు. కావాల‌నే కులాలు, మతాలు మధ్య చిచ్చుపెడుతున్నారని పేర్కొన్నారు. ఇంతటి అన్యాయమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుని దయ, ప్రజల చల్లని దీవెనలతో రెండున్నర ఏళ్ల పరిపాలన సంతృప్తికరంగా చేయగలిగానని సీఎం జగన్ చెప్పారు. ఇంకా మంచి చేయడానికి కూడా వెనకాడనన్నారు సీఎం.

ప్రజలకు ఎలాంటి మేలు జరగకూడదు.. ప్రభుత్వ పథకాలు అమలు కాకూడదు.. అలా జరిగితే ప్రజలకు లబ్ధి చేకూరుతుంది.. సీఎం జగన్‌కు మంచి పేరు వస్తుంది.. తమకు మనుగడ ఉండదన్న భయంతోనే.. వాటిని అడ్డుకోవాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు

Related posts