telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ప్రజాకవి కాళోజీ” బయోపిక్ తీయడం ఒక సాహసం : కేటీర్

kaloji

జైనీ క్రియేషన్స్ సంస్థ “ప్రజాకవి కాళోజీ” అనే పేరుతో కాళోజీ బయోపిక్ సినిమాను నిర్మిస్తోంది. బుధవారం కాళోజి జయంతి సంధర్భంగా దీనికి సంబందించిన ఆవిష్కరణ కార్యక్రమాన్నిఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ చీఫ్ గెస్ట్‌గా హాజరై నారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ .. కాళోజీ నారాయణరావు తెలంగాణ చైతన్య స్ఫూర్తి అని అన్నారు. కళలకు కాణాచి అయిన వరంగల్ జిల్లా నుండి జయకేతనం ఎగురవేసి విశ్వమంతా ఖ్యాతినార్జించిన మహాకవి అని కొనియాడారు. కాళోజీ జయంతి సందర్భంగా వీడియో సాంగ్ ను తన చేతుల మీదుగా విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. కాళోజీ నారాయణరావు బయోపిక్ తీయడం అంటే ఒక సాహసమని అన్నారు. తెలుగువారిలో సాహిత్య రంగంలో “పద్మ విభూషణ్” పొందిన ఏకైక వ్యక్తి కాళోజీ అని గుర్తు చేస్తూ ఈ సినిమాను నిర్మిస్తున్న ప్రభాకర్ జైనీని అభినందించారు.

Related posts