telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మూగ, బధిర యువతిగా సమంత

Sam

అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన అందం, అభినయం, విభిన్నమైన సినిమాలతో భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్ లో వెబ్ వరల్డ్ లో కూడా అడుగు పెట్టబోతోంది. సమంత సోషల్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నాగ చైతన్యను పెళ్లాడిన తర్వాత ఈ ఇద్దరు కలిసి నటించిన మజిలీ మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నందినిరెడ్డి దర్శకత్వంలో నటించిన ఓ బేబీ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇక ఇటీవల వచ్చిన 96 రీమేక్ ‘జాను’ మాత్రం నిరాశ పరిచిన సమంత నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈ బ్యూటీ మరో ప్రయోగానికి సిద్ధమవుతుందని తెలుస్తుంది. గతంలో ‘మయూరి’, గేమ్ ఓవర్’ చిత్రాలను రూపొందించిన దర్శకుడు అశ్విన్ ఇప్పుడు సమంత హీరోయిన్ గా హారర్ కథాంశంతో సినిమా చేయబోతున్నాడని సమాచారం. తెలుగు, తమిళ ద్విభాషా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో సమంత మూగ, బధిర యువతిగా కనిపించనుందని తెలుస్తుంది. సమంత ఈ పాత్రను ఛాలెంజ్ గా తీసుకుని చేయడానికి సిద్ధంగా ఉందని తెలుస్తుంది.

Related posts