telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బిగ్ బాస్-4” ఎంట్రీపై స్పందించిన సింగర్ సునీత

Sunita

తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజ‌న్ 4 సంద‌డి షురూ కానుంది. బిగ్ బాస్ 4 ప్రారంభానికి అంతా రెడీ అయింది. సెప్టెంబ‌ర్ 6న సాయంత్రం 6 గంట‌ల‌కు బిగ్ బాస్ షో ప్రసారం కానున్న‌ట్టు నిర్వాహ‌కులు తెలిపారు. మూడో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన కింగ్ నాగార్జునే నాలుగో సీజన్‌కి హోస్టింగ్ చేస్తున్నారు. ఇప్పటికే నాగార్జున ప్రోమోతో ఆదరగొట్టేశారు. బిగ్ బాస్-4లో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితాలో ప‌లువురు పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. వాటిల్లో సింగర్ సునీత పేరు కూడా ఉంది. దీనిపై స్పందించిన సునీత “నా ప్రియమైన మిత్రులారా.. నేను బిగ్‌బాస్ 4 తెలుగులో లేను.. భవిష్యత్తులోనూ ఉండను. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్” అని ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో ప్రకటించారు.

Related posts