నటి సురేఖా వాణి పలు సినిమాలలో, టీవీ షోలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. భర్త సురేష్ తేజ, కూతురుతో కలిసి హైదరాబాద్ లో జీవిస్తున్నారు. అయితే ఈరోజు ఆమె భర్త సురేష్ తేజ మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం నాడు ఉదయం మృతి చెందారు. సురేష్ తేజ పలు టీవీ షోలకు దర్శకత్వం వహించారు. సురేష్, సురేఖలది ప్రేమ వివాహం. సురేఖా టీవీ యాంకర్ గా ఉన్న సమయంలోనే ఇద్దరూ ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. సురేష్ తేజ పలు టీవీ షోలకు దర్శకత్వం వహించారు. ఆయన డైరెక్ట్ చేసిన మాటాకీస్, హార్ట్ బీట్, మొగుడ్స్ పెళ్లామ్స్ లాంటి షోలకు సురేఖా వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సురేష్ మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సురేఖవాణికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
previous post