telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

సినిమాలు, ప్రార్థనా స్థలాలకు అనుమతి లేదు: నవీన్ పట్నాయక్

Naveen patnyak Odisha

కేంద్రం ప్రకటించిన అన్ లాక్ 5.0 గైడ్ లైన్స్ ను ప్రస్తుతం అమలు చేసే పరిస్థితి లేదని ఒడిశా సర్కారు పేర్కొంది. కరోనా వ్యాప్తి అధికంగా ఉండటమే ఇందుకు కారణమని తెలిపింది. రాష్ట్రంలోని సినిమా హాల్స్, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాల్స్, ప్రార్థనా స్థలాలు అక్టోబర్ 31 వరకూ మూతబడే ఉంటాయని స్పష్టం చేసింది.

అన్ లాక్ 5.0 గైడ్ లైన్స్ ను కేంద్ర హోమ్ శాఖ విడుదల చేసిన మరుసటి రోజునే సీఎం నవీన్ పట్నాయక్ అన్ లాక్ 5.0 సడలింపులు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేసింది. స్కూళ్లు, కాలేజీలు, విద్యా సంస్థలు కూడా మూసే ఉంచుతామని పేర్కొంది.

ఎంట్రెన్స్ టెస్టులకు మాత్రం అనుమతిస్తామని, నిబంధనలకు అనుగుణంగా విద్యా సంస్థల్లో నిర్వహణా కార్యకలాపాలు జరుపుకోవచ్చని స్పెషల్ రిలీఫ్ కమిషనర్ పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి.

Related posts