telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణ కరోనా అప్డేట్…

sanitizer mask corona

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు కాస్త తగ్గాయి. తాజాగా ఆరోగ్యశాఖ రిలీజ్ చేసిన బులెటిన్ ప్రకారం, కొత్తగా 997 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,55,663కి చేరింది. ఇందులో 2,37,172 మంది కోలుకొని ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. 17,094 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కరోనాతో నలుగురు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1397కి చేరింది. తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 48,12,167 కరోనా టెస్టులు నిర్వహించినట్టు కరోనా బులెటిన్ లో పేర్కొన్నారు. బుధవారం రాత్రి 8గంటల నుంచి గురువారం రాత్రి 8 గంటల వరకు మొత్తం 42,163 కరోనా టెస్టులు నిర్వహించినట్టు కరోనా బులెటిన్ లో పేర్కొన్నారు. కోవిడ్‌ మరణాల రేటు భారత్‌ వ్యాప్తంగా 1.5 శాతంగా ఉంటే.. తెలంగాణలో అది 0.54 శాతానికి పడిపోయింది.. ఇక, రికవరీ రేటు దేశంలో 92.7 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 92.34% శాతానికి పెరిగిందని బులెటిన్‌లో సర్కార్ పేర్కొంది .

Related posts